Hyderabad PRT Transport: హైదరాబాద్ క్యూర్ పరిధిలో PRT రవాణా.. ట్రాఫిక్ కష్టాలకు చెక్, సీఎం కీలక ఆదేశాలు

2 weeks ago 11
హైదరాబాద్‌ క్యూర్ పరిధిలో ప్రజా రవాణా, రహదారుల అనుసంధానం, రీసైకిల్డ్ వాటర్ వినియోగాన్ని మెరుగుపరచాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రద్దీ ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థను మెట్రో, ఎంఎంటీఎస్‌, బస్సులతో అనుసంధానించాలని సూచించారు. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్‌వే ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడంతో పాటు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల పనులను వేగవంతం చేయాలని చెప్పారు. హైదరాబాద్‌–ముంబై బుల్లెట్ ట్రైన్ మార్గానికి సమాంతర రహదారి, శంకర్‌పల్లి–చేవెళ్ల రోడ్ల అభివృద్ధిని పరిశీలించాలని ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ, డేటా సెంటర్లు, పరిశ్రమలకు 500 ఎంఎల్‌డీ రీసైకిల్డ్ వాటర్ వినియోగ ప్రణాళికలను అమలు చేయాలని సూచించారు.
Read Entire Article