Hyderabad Weather: హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులుగా మారాయి. ఎక్కడిక్కడ ట్రాఫిక్ స్తంభించింది. కొన్ని రోజులుగా ఉక్కపోతగా ఇబ్బంది పడుతున్న నగర వాసులను వరుణుడు పలకరించాడు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో అల్లకల్లోలంగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ట్రాఫిక్ స్తంబించిపోయింది.