Hyderabad Ganesh Immersion Procession: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు నేటికీ కొనసాగుతున్నాయి. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ రోటరీ పరిసరాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదని సీపీ సజ్జనార్ తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఈ మార్గాల్లో ప్రయాణించవద్దని, అవసరమైతే ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకోవాలని సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకోవద్దని కోరారు. ట్రాఫిక్ విభాగం అధికారిక సూచనలు, అడ్వైజరీలను గమనిస్తూ పోలీసులకు సహకరించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.