తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణలు హిందువులను తీవ్ర ఆ:దోళనకు గురిచేశాయి. ఈ తరుణంలో ఓ గుడి ముందు మాంసం ముక్క ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. దసరా పండుగ రోజు ఆలయం ముందున రోడ్డుపై ఓ జంతువు మాంసం ముక్క ఉన్న విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియాలోనూ పోస్ట్‌లు పెట్టడంతో వైరల్ అయ్యింది. అయితే, పోలీసులు దీనిపై విచారణ చేపట్టి అసలు విషయం తేల్చారు.