హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట చౌరస్తా, ఫలక్‌నుమా ప్రాంతాల మధ్య నిర్మాణంలో ఉన్న కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ) పనులు తుదిదశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత స్థానికులకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందని అధికారులు హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును జీహెచ్‌ఎంసీ దక్షిణ మండలం మొదటి డివిజన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. ఫలక్‌నుమా ఆర్వోబీ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ రూ.47.10 కోట్లు కేటాయించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.