హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. దివ్యారెడ్డి దొడ్ల అనే మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్లు 1.20 కోట్లు టోకరా వేశారు. ఫేక్ వాట్సాప్ అకౌంట్ నుంచి దివ్యారెడ్డి అకౌంటెంట్‌కు మెసేజ్ పంపించి మోసం చేశారు. తాను మీటింగ్‌లో ఉన్నానని, తాను చెప్పిన బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపించాలని ఆ మెసేజ్‌లో ఉండటంతో.. అకౌంటెంట్ అదే పనిచేశారు. అయితే మార్చి 17న మరోసారి ఇలాంటి మెసేజ్ రావటం.. ఈ విషయాన్ని అకౌంటెంట్.. దివ్యారెడ్డికి తెలియజేయటంతో మోసపోయిన విషయం అర్థమైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.