తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక ముందడుగు వేసింది. దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు దిగ్గజ సంస్థ టీసీఎస్ ముందుకొచ్చింది. దీని ద్వారా రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెటనుంది. ఒక గిగా వాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఈ డేటా సెంటర్ ద్వారా 7 వేల ఉద్యోగాలు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.