తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. TPDMA ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ బంద్ అనంతరం అన్ని పట్టణాల్లో మానవహారాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం, అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. బకాయిలు ఆలస్యం కావడంతో అధ్యాపకులు, సిబ్బందికి జీతాలు చెల్లించడం కష్టంగా మారిందని పేర్కొంటున్నాయి. సమస్య పరిష్కారం కాకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి.