మొన్నటివరకు తెలంగాణలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రి పాలైన ఘటనలు కలకలం రేపగా.. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులు రక్తపు వాంతులు చేసుకోవటం సర్వత్రా ఆందోళనకరంగా మారింది. చింతల్‌లోని శ్రీచైతన్య క్యాంపస్‌లో విద్యార్థులు రక్తపు వాంతులు చేసుకోవటంతో.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆస్పత్రి సిబ్బంది సకాలంలో స్పందిచటంతో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది.