Hydra Report: చెరువులను పరిరక్షించేందుకు, అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా.. హైదరాబాద్‌లో ఇప్పటివరకూ 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఆక్రమణదారుల నుంచి ఇప్పటివరకు 111 ఎకరాలకు పైగా స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఇందులో అమీన్‌పూర్ చెరువు పరిధిలో అత్యధిక విస్తీర్ణం ఉంది. భవిష్యత్తులో మరింత పకడ్బందీగా, దూకుడుగా కూల్చివేత చర్యలను హైడ్రా కొనసాగించనుంది. పేదల ఇళ్ల స్థలాలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో హైడ్రా తన వ్యూహాన్ని మార్చుకుంది.