Hydra: హైదరాబాద్‌లో మొట్టమొదటి హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయింది. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. బుద్ధభవన్‌లో ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సర్కార్ తెలిపింది. ఇప్పటికే హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు చట్టానికి కూడా సవరణలు చేసింది. మరోవైపు.. నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై వెనక్కి తగ్గేది లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు.