గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ బుద్ధభవన్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు సిద్ధమైంది. కొత్త ఏడాది నుంచి ప్రతి సోమవారం ప్రజల నుంచి హైడ్రా అధికారులు ఫిర్యాదులు స్వీకరించనున్నారు.