HYDRAA: హైడ్రా అనేది ఒక రాక్షసి కాదని.. ప్రజలకు భరోసా అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. అమీన్‌పూర్‌లో, సున్నంచెరువులో, కూకట్‌పల్లిలో కూల్చివేతలకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు కథనాలతో వీడియోలను వైరల్ చేస్తున్నారని రంగనాథ్ తెలిపారు. వాటి వెనుక ఉన్న అసలు వాస్తవం ఇది అంటూ మీడియా సమావేశంలో వివరించారు. మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి దాన కిశోష్‌తో కలిసి రంగనాథ్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణ గురించి తెలిపారు.