Hydraa: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా ఏర్పాటు కాకముందు అనుమతి ఇచ్చిన ఎలాంటి నిర్మాణాలు, కట్టడాలను తాము కూల్చబోమని స్పష్టం చేశారు. అంతేకాకుండా అనుమతి లేకుండా జులై కంటే ముందు నిర్మించిన కట్టడాలను కూల్చమని హైడ్రా కమిషనర్ తేల్చి చెప్పారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణాలు మాత్రం కూల్చక తప్పదని ఏవీ రంగనాథ్ హెచ్చరించారు.