ఆంధ్రప్రదేశ్‌లో వరదల కారణంగా నష్టపోయిన వారికి అండగా నిలిచేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెళ్లువెత్తుతున్నాయి. తాజాగా వర్షాల కారణంగా నష్టపోయిన పంచాయతీలకు నటుడు హైపర్ ఆది విరాళం అందించారు. రెండు పంచాయతీలకు మూడు లక్షల రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి విరాళం తాలూకు చెక్కును అందజేశారు. పలు సంఘాలు, నేతలు కూడా పవన్ కళ్యాణ్‌కు విరాళాలు అందజేశారు.