Janasena: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి మరో షాక్ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అంతా పార్టీని వీడుతున్నారు. వారంతా అటు టీడీపీలోనో.. ఇటు జనసేన పార్టీలోకో వెళ్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తాకింది. కోడుమూరు నియోజకవర్గ నేత, వైసీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సంధ్యా విక్రమ్ కుమార్.. పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన త్వరలోనే జనసేనలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.