జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ 48.49 శాతంగా నమోదైంది. అత్యధికంగా రహ్మత్‌నగర్, బోరబండ డివిజన్లు పోలింగ్‌లో కీలకంగా మారాయి. రేపు (శుక్రవారం, నవంబర్ 14) ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ కౌంటింగ్ జరుగుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి.. ఆ తర్వాత 407 కేంద్రాల ఓట్లను 10 రౌండ్లలో పూర్తి చేస్తారు. మొత్తం 58 మంది అభ్యర్థుల కోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కేంద్రం వద్ద పటిష్ట భద్రత, 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.