ఏపీలో సంచలనం రేపుతున్న కాదంబరి జత్వానీ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రాథమిక దర్యాప్తు పత్రం(ఎఫ్ఐఆర్) నమోదు చేశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో పాటుగా మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు విధుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఇద్దరు పోలీసులను సైతం సస్పెండ్ చేశారు. దీంతో కాదంబరి జత్వానీ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదీ ఆసక్తికరంగా మారింది.