Kakinada Temple: మీకేం పోయేకాలం.. ఆఖరికి గుడిని కూడా వదలరా!

3 hours ago 3
కాకినాడ జిల్లా తొండంగి మండలం పి.అగ్రహారం వలసపాకలో ఓ ఆలయంలో చోరీ జరిగింది. దుర్గమ్మ గుడి తాళం పగలకొట్టి లోపలికి చొరబడిన దొంగ.. ఆలయంలో చోరీ చేశాడు. అమ్మవారి మెడలో ఉన్న మూడు జతల బంగారు సూత్రాలు చోరీ చేశాడు. అమ్మవారి వెండి కిరీటం ఎత్తుకెళ్లాడు. ఈ చోరీ ఘటన మొత్తం గుడిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. ఆలయంలో చోరీపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆలయాన్ని పరిశీలించిన పోలీసులు.. దొంగ కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ పుటేజ్‌లో దొంగతనం దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి.
Read Entire Article