Keerthi Richmond Villas Ganesh Laddu Auction:హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని కీర్తి రిచ్‌మండ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్‌లో గణనాథుడి లడ్డూ మరోసారి అత్యధిక ధర పలికింది. శక్తిమాన్ బృంద సభ్యులు ఈ లడ్డూను రూ.1.01 కోట్లకు దక్కించుకున్నారు. గతేడాది ఇదే కమ్యూనిటీలో లడ్డూ రూ.2.31 కోట్లు పలికింది. వేలం అనంతరం గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. ఇక హైదరాబాద్ ప్రసిద్ధ బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం సెప్టెంబర్ 25న జరగనుంది. 2025లో బాలాపూర్ లడ్డూ రూ.35 లక్షలకు వేలం పాడారు. 1994లో రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం ఆ తర్వాత లక్షలకు చేరుకుంది.