German Technology Krishna River Bridge: నారాయణపేట జిల్లా వాసునగర్, కర్ణాటకలోని శక్తినగర్ మధ్య కృష్ణానదిపై రూ.185 కోట్ల అంచనా వ్యయంతో విల్లు ఆకృతిలో వంతెన నిర్మించనున్నారు. జర్మనీ సాంకేతికతతో బౌస్ట్రింగ్ ఆర్చ్ విధానంలో 750 మీటర్ల పొడవున ఈ వారధి రూపుదిద్దుకుంటోంది. 84 మీటర్ల పొడవు, 335 టన్నుల బరువున్న 16 గడ్డర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి కోసం స్టీల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. నిజాం కాలం నాటి పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో ఎన్‌హెచ్-167పై కొత్త వంతెనల నిర్మాణం చేపట్టారు. ఇవి రెండు రాష్ట్రాల మధ్య రవాణాను మెరుగుపరచనున్నాయి.