తెలంగాణలో ఫార్ములా ఈ రేసు వ్యవహారం ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మరో ఇద్దరు అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేయగా.. త్వరలోనే నోటీసులు జారీ చేయనుందని తెలుస్తోంది. ఇంతలోనే.. సీన్‌లోకి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఏసీబీకి ఈడీ ఓ లేఖ రాయటం సర్వత్రా సంచలనంగా మారింది.