ఏపీలోని వరద బాధితులకు అండగా విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా స్ట్రీట్ ఫుడ్ వ్యాపారంతో ఫేమస్ అయిన కుమారి ఆంటీ వరద బాధితులకు విరాళం అందించారు. ఏపీ వరద బాధితుల కోసం 50 వేల రూపాయలు విరాళం ఇచ్చారు. క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి విరాళం తాలూకు చెక్ అందజేశారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి అక్కడకు వచ్చిన కుమారి ఆంటీ తన విరాళం సీఎం చేతికి అందించారు. మరోవైపు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా కుమారి ఆంటీ విరాళం అందించిన సంగతి తెలిసిందే.