కర్నూలులో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా వేల్పనూరులోని ఓ మెడికల్ షాపు నిర్వాహకుడి వద్దకు ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. తనకు అత్యవసరంగా రూ.50 వేలు అవసరం ఉందని.. నగదు రూపంలో రూ.49,500 ఇస్తే, రూ.50 వేలు ఫోన్ పే చేయిస్తానని చెప్పాడు. అన్నట్లుగానే మెడికల్ షాప్ యజమానికి మొబైల్ ఫోన్‌కు రూ.50 వేలు జమైనట్లు మెసేజ్ వచ్చింది. దీంతో గుర్తు తెలియని కొత్త వ్యక్తికి రూ.49,500 ఇచ్చి పంపాడు. కానీ కాసేపటికే కర్నూలు నుంచి ఫోన్ చేసిన ఓ వ్యక్తి తన ఫోన్ పే నుంచి అనుకోకుండా రూ.50 వేలు ఫోన్ పే చేశానని వెనక్కి పంపాలని కోరాడు. దీంతో ఇతను షాక్ తిన్నాడు. చివరకు ఈ విషయం కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్ చేరింది.