రాష్ట్రంలోని అనధికారిక లే అవుట్లలోని ఫ్లాట్లను క్రమబద్దీకరించేందుకు మరోసారి LRS స్కీం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా.. LRSకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు రెడీ చేసింది. మార్చి 31లోగా చెల్లిస్తేనే 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఫీజు చెల్లించాక క్షేత్రస్థాయిలో పరిశీలనల ఉంటాయని.. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దరఖాస్తుల తిరస్కరణ ఉంటుందని అధికారులు తెలిపారు.