అన్నమయ్య జిల్లా మదనపల్లెలో భర్త కోసం ఇద్దరు భార్యలు ఆత్మహత్యకు యత్నించిన ఘటన చోటుచేసుకుంది. రెడ్డి శేఖర్ అనే వ్యక్తి దుర్గ అనే మహిళను తొలుత పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండు పెళ్లిళ్ల సంగతి తెలిసి.. ఇద్దరు భార్యలు తగువులాడుకున్నారు. నా భర్త నాకే కావాలంటూ గొడవపడ్డారు. చివరకు ఆత్మహత్యకు కూడా యత్నించారు. అయితే కుటుంబసభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.