సామాజిక మాధ్యమాలను సరిగ్గా వినియోగించుకుంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, పలు సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయి. ఇందుకు ఉదాహరణగా నిలిచే ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. తల్లిని కోల్పోయిన అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులకు సాయం చేయడానికి మానవత్వంతో ముందుకొచ్చారు. ఎన్నో హృదయాలు వారికి అండగా నిలిచాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్‌ను చూసి స్పందించిన దాతలు.. తలోచేయి వేశారు. వారంతా కలిసి ఆ చిన్నారులకు ఏకంగా రూ.21 లక్షలు సమకూర్చారు.