మంచు వారి ఫ్యామిలీ ఫైట్ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు గొడవలు, దాడులు, ఫిర్యాదులు, నోటీసుల వరకే నడిచిన ఈ ఎపిసోడ్‌లో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయటంతో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టయింది. తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మోహన్ బాబు మేనేజర్, మంచు విష్ణు ప్రధాన అనుచరుడైన కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వినయ్ రెడ్డి అనే వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.