సెల్ ఫోన్.. ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరికీ నిత్యావసరం. అవసరం ఉన్నా లేకపోయినా.. ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఎలాగో.. సెల్ ఫోన్ అలా మారిపోయింది. అయితే సెల్ ఫోన్ ఉన్నా.. అందులో సిగ్నల్ లేకపోతే అది మరో సమస్య. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య తక్కువగా ఉన్నా.. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఈ సమస్య చాలా అధికం. ఆయా ప్రాంతాల్లో సెల్ ఫోన్ సిగ్నళ్ల కోసం బండరాళ్లు, చెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. ఇక రేషన్ సరుకులు అందించే సమయంలోనూ, పింఛన్ల జారీ సమయంలో అధికారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు పలుచోట్ల సెల్ టవర్ల నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలోనే పార్వతీపురం మన్యం జిల్లాలోనూ 190 గ్రామాల్లో సెల్ టవర్ల నిర్మాణం జరుగుతోంది.