ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్ కొత్తగా ఉంటే చిన్న సినిమా కూడా పెద్ద సినిమా రేంజ్‌లో బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన హిట్లు కొడుతున్నాయి. అలా.. మలయాళం నుంచి గతేడాది డిసెంబర్‌లో మార్క్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన ఊచకోత అంతా ఇంతా కాదు. అసలెలాంటి అంచనాల్లేకుండా రిలీజైన ఈ సినిమా విధ్వంసం సృష్టించింది.