మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదనపై నారా లోకేష్ సెటైర్లు పేల్చారు. మావిగన్ పదానికి కొత్త నిర్వచనం ఇచ్చారు లోకేష్. ఈ విషయంపై ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ మావిగన్ కారిడార్‌ను రాజధానిగా అభివృద్ధి చేయవచ్చని జగన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు లోకేష్.