Metro Rail: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రహదారులు, రైల్వే లైన్లు, ఎయిర్‌పోర్టులు.. ఇలా కీలక మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టులను రాష్ట్రానికి రప్పించుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే నేషనల్ హైవేలు, కొత్త రైల్వే లైన్లు, కొత్త విమానాశ్రయాలు నిర్మించనుండగా.. తాజాగా మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి.. కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. విశాఖ, విజయవాడ నగరాల్లో నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి తాజాగా సమీక్ష చేశారు.