YCP MLC Arrest: వైఎస్సార్సీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే కేసులో ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగిలిన వారి కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో నిందితులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో వారంతా అజ్ఞానంలోకి వెళ్లారు.