ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం (ఫిబ్రవరి 27) ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి నుంచి రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండుచోట్లా పీడీఎఫ్ నుంచి వారికి గట్టిపోటీ ఎదురవుతోంది.