ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. బుధవారం మధ్యాహ్నం ప్రధానితో భేటీ అయ్యారు. సుమారుగా గంటపాటు వీరి భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక విషయాలపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యంతో పాటుగా నిధుల కేటాయింపుపై చర్చించినట్లు తెలిసింది. అలాగే అమరావతి, పోలవరం ప్రాజెక్టుతో పాటుగా రాజకీయ విషయాలపైనా చర్చించినట్లు సమాచారం. మరోవైపు జనవరిలో ప్రధానమంత్రి ఏపీకి రానున్న సంగతి తెలిసిందే.