వారం వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్‌పై రెండు తుఫాన్లు విరుచుకుపడ్డాయి. గతవారం బంగాళాఖాతంలో అత్యంత తీవ్ర తుఫాను అర్నబ్ పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఈ తుఫాను నుంచి కోలుకోక ముందు ‘మురసు’ ముంచుకొచ్చింది. ఈ తుఫాను ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉంది. ఒంగోలు వద్ద తీరం దాటిన ఈ తీవ్ర తుఫాను ప్రస్తుతం గంటకు 6 కి.మీ. వేగంతో ముందుకు సాాగుతోంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఏపీఎస్డీఎంఏ హెచ్చరికలు చేసింది.