ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసి, చిరంజీవిపై తన అభిమానాన్ని తెలియజేశారు. చిరంజీవి స్థాపించిన ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో ప్రాణాలు రక్షించడం జరుగుతోంది. ఈ సందర్భంలో మాట్లాడుతూ, చిరంజీవి పిలుపును సంతోషంగా స్వీకరించి, తన వంతు కర్తవ్యంగా భావించి రక్తదానం చేశానని తెలిపారు.