Nadendla Manohar: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే నెల నుంచి రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. త్వరలోనే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు. ఇక ఈ-కేవైసీ పూర్తి అయితే ఎంతమందికి కార్డులు ఇవ్వాలి అనేదానిపై స్పష్టత వస్తుందని నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పారు. ఈ స్మార్ట్ కార్డుల విశిష్టత ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.