సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి బాలకృష్ణ తెలుగుదనం ఉట్టి పడేలా పంచె కట్టుతో హాజరయ్యారు. మరోవైపు నటుడిగా సినీ రంగానికి బాలకృష్ణ సేవలను గుర్తించి కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.