గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి పద్మభూషణ్ అవార్డు దక్కింది. కళారంగంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. వైద్యరంగంలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి పద్మభూషణ్ పురస్కారం దక్కింది. ఈ క్రమంలోనే సీఎం నారా చంద్రబాబు నాయుడు.. బాలయ్యకు అభినందనలు తెలియజేశారు. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు అభినందనలు తెలిపిన చంద్రబాబు.. ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతున్నారంటూ ప్రశంసించారు.