నంద్యాల జిల్లా బనగానపల్లెలో అద్భుతం జరిగింది. సంజామల మండలం పేరుసోముల గ్రామంలోని కోట వీధిలో ఉన్న మద్దిలేటి ఇంటిముందు పురాతన శివాలయం ఒకటి బయటపడింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయం చూసేందుకు తరలివస్తున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజామల మండలం పేరుసోముల గ్రామంలో పురాతన శివుని గుడి ఒకటి బయటపడింది. గ్రామంలోని కోట వీధిలో ఉన్న మద్దిలేటి ఇంటి ముందు గండి ఏర్పడింది. ఏంటా అని స్థానికులు పరిశీలించగా.. ఆ ఇంటి కింద పురాతన శివాలయం ఒకటి బయటపడింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయం చూసేందుకు తరలివస్తున్నారు. ఈ పురాతన శివాలయం రాజుల కాలం నాటిదని అంటున్నారు. రానున్న రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో భక్తులు అందరు పూజలు చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.