Nara Lokesh on New airports in AP: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఉన్న ఏడు ఎయిర్‌పోర్టులకు అదనంగా మరో ఏడు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రం కోరిన ప్రాంతాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వెల్లడించారు. తాజాగా ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అన్ని జిల్లాలకు ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ పెంచుతామని తెలిపారు.