Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సంబంధిత నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఏపీలో అమలు అవుతున్న ఫీజు రియంబర్స్‌మెంట్ పథకం గురించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు లోకేష్ వెల్లడించారు. మరోవైపు.. రెడ్ బుక్ గురించి మరోసారి ప్రస్తావించిన లోకేష్.. గత ప్రభుత్వ అక్రమాలన్నీ బయటికి తీస్తామని తేల్చి చెప్పారు.