Narasaraopeta Bird Flu Death: ఏపీలో బర్డ్ ఫ్లూతో రెండేళ్ల పాప మృతి

2 weeks ago 14
ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ మరణం కలకలం రేపుతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూ వైరస్‌తో ప్రాణాలు కోల్పోయింది. ICMR కూడా పాప మరణానికి బర్డ్‌ఫ్లూ కారణమని తేల్చింది. మార్చి 16న బాలిక మరణించగా.. కొన్ని పరీక్షల తర్వాత ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూతో మరణించిన మొదటి కేసు ఇదేకాగా.. ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. పచ్చి కోడి మాంసం తినడం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల చిన్నారి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ముఖ్యంగా పచ్చి మాంసం తినడం, జబ్బు పడిన పక్షులకు దూరంగా ఉండటం చాలా ముఖ్యంమని.. ఏదైనా అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article