andhra pradesh excise policy Starts from october: ఏపీలోని మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం ధరలు భారీగా తగ్గనున్నట్లు సమాచారం. అలాగే అన్ని ప్రముఖ బ్రాండ్లను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటికల్లా అన్ని ఫేమస్ బ్రాండ్లను అందుబాటులో ఉంచేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి తేనున్న ప్రభుత్వం.. నాణ్యమైన మద్యాన్ని క్వార్టర్ బాటిల్ వందలోపే తీసుకురావాలని ఆలోచిస్తోంది. క్వార్టర్ బాటిల్ ధర రూ.80 నుంచి రూ.90 ల్లోపే ఉండనున్నట్లు సమాచారం.