NIA Riads in Hyderabad: హైదరాబాద్ పాతస్టీలో మరోసారి ఉగ్ర కదలికలు బయటపడ్డాయి. ఆగస్టులో ఢిల్లీలో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ అబ్దుల్.. చాలా రోజులు హైదరాబాద్ పాతబస్తీలోనే మకాం పెట్టినట్టుగా తేలింది. సైదాబాద్‌లోని గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్‌లోనే చాలా నెలలు తల దాచుకున్నట్టు ఎన్ఐఏ విచారణలో బయటపడింది. దీంతో.. రిజ్వాన్‌ను వెంటబెట్టుకుని మరీ.. ఎన్ఐఏ అధికారులు గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్‌లో సోదాలు నిర్వహించారు.