వరద బాధితులను ఆదుకునేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు, సంస్థలు సీఎం సహాయనిధికి విరాళాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే మెగా డాటర్ కొణిదెల నిహారిక కూడా తన వంతు సాయం ప్రకటించారు. ముంపునకు గురైన పది గ్రామాలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. పది గ్రామాలకు రూ.50 వేలు చొప్పున ఐదు లక్షలు విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు నిహారిక తెలిపారు.