ఉపాధి హామీ కూలీలకు కేంద్రం తీపికబురు వినిపించింది. ప్రస్తుతం రోజుకు రూ.263 చెల్లిస్తుండగా.. దానిని రూ.300లకు పెంచేలా చర్యలు చేపట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేసి.. బోగస్ మస్టర్లకు అడ్డుకట్ట వేయటం ద్వారా కూలీ పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బోగస్ మస్టర్ల ఏరివేత సహా పని వేళల్లో మార్పులు చేయడం ద్వారా ఉపాధి కూలీల వేతనం రూ.300లకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనుంది.