తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి త్వరలో "తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్"ను విడుదల చేయనున్నారు. ఈ ప్రణాళికలో 770 కి.మీ 'ప్రజా వలయం' (రూరల్ రింగ్ రోడ్), 1,150 కి.మీ 'తెలంగాణ మణిహారం' (బోర్డర్ రింగ్ రోడ్) మరియు 2,550 కి.మీ రేడియల్ రోడ్ల విస్తరణ ముఖ్యమైనవి. అంతేకాక.. హై స్పీడ్ RRTS కారిడార్ల నిర్మాణం కూడా ప్రతిపాదించారు. ఈ భారీ ప్రణాళికతో గ్రామాలు, పట్టణాలు, పరిశ్రమల మధ్య కనెక్టివిటీ పెరిగి.. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.