Tiger at Paderu Darakonda Ghat Road: అల్లూరి సీతారామరాజు జిల్లా దారకొండ ఘాట్‌లో పెద్దపులి సంచారం వార్తలు స్థానికులను భయపెడుతున్నాయి. ఆర్టీసీ బస్సులో పాడేరు వెళ్తున్న ప్రయాణికులకు దారకొండ ఘాట్ రోడ్డులో పెద్దపులి కనిపించింది. దీంతో వారంతా భయపడిపోయారు. అయితే పెద్దపులి అక్కడి నుంచి వెళ్లిపోయే వరకూ వేచిచూశారు. ఈ క్రమంలోనే కొంతమంది ఘాట్ రోడ్డులో పెద్దపులి సంచారాన్ని వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరోవైపు పెద్దపులి సంచారం నేపథ్యంలో స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు.